గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (11:06 IST)

నేడు విశాఖ గర్జన.. మూడు రాజధానుల నినాదం.. లక్షమందితో భారీ ర్యాలీ

Visaka Garjhana
Visaka Garjhana
విశాఖ గర్జన నేడు జరుగనుంది. మూడు రాజధానుల నినాదాన్ని మారుమోగించే దిశగా ఈ విశాఖ గర్జన జరగనుంది. వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందితో భారీ ర్యాలీ తీయనున్నారు.

విశాఖ గర్జన కోసం వెయ్యి మందికి పైగా పోలీసు భద్రత కల్పించారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గర్జనకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. ఎల్.ఐ.సీ.జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4కి.మీ ర్యాలీ నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నేతలు.

ఇక ఇప్పటికే జేఏసీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైసీపీ. శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా ఉత్తరాంద్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెబుతామని జేఏసీ హామీ ఇచ్చేసింది.

ఇందులో భాగంగా మూడు రాజధానులు, జాతీయ పతాకాలతో ర్యాలీని లీడ్ చేయనున్నారు 50 మంది స్కెటర్లు. బీచ్ రోడ్డులో బహిరంగ సభ ఉండనుంది.