తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ నిలుపుదల
తిరుపతిలో జారీ చేస్తున్న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా టీటీడీ నిలుపుదల చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది. తిరుమల, తిరుపతిలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కావున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వబడవు. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ లో తనిఖీల అనంతరం అనుమతిస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.