బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (19:21 IST)

ఎయిడెడ్ పాఠశాలల వివాదం: . అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా పర్లేదు..

విశాఖలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. జ్ఞానాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా ఫర్వాలేదంటూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
 
ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లీపురం, రైల్వే న్యూ కాలనీ, కొబ్బరి తోట, పూర్ణా మార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 
 
విద్యా సంవత్సరం మధ్యలో ఉండగానే ఇలా పాఠశాలను మూసివేయడం దారుణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమైనా, కలెక్టరయినా ప్రజల గురించి ఆలోచించాలని.. ఉన్నట్టుండి ఇలా పాఠశాలను మూసివేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.