విజయవాడలో చేపల మార్కెట్లు ఉదయం 10 గంటల వరకు మాత్రమే
విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఉన్న చేపల మార్కెట్లు (హోల్ సేల్ మరియు రిటైల్) అన్నియు ది.30.05.2021 ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు మాత్రమే అనుమతి అని వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా. రవి చంద్ ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ నిబందనలు పాటించని మాంసం లేదా చేపల మార్కెట్ సముదాయాలలో షాపుల యజమానులు మరియు వ్యక్తులపై కమిషనర్ ఆదేశాల మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగునని రవి చంద్ తెలిపారు.
ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలు లో ఉన్న దృష్ట్యా మార్కెట్ / షాపులలో ఐదుగరి మించి గుమ్మిగూడ కుండా చూడాలని షాపుల వారిని హెచ్చరించారు.
అదే విధంగా ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నియమ నిబందనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని ఎవరైనా నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించి అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ సముదాయాలలోని చికెన్ / మట్టన్ షాపుల వద్ద తప్పని సరిగా నియంత్రణ పాటించాలన్నారు.
దూరం దూరంగా ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవని సూచిస్తూ, బహిరంగ ప్రదేశాలలో ఎవరు చేపల విక్రయాలు నిషేదించుట జరిగిందని ఎవరైనా నగరపాలక అధికారులు / సిబ్బంది యొక్క ఆదేశాలు ఉల్లఘించిన అట్టి వారిపై ఖఠీన చర్యలు తప్పవని అన్నారు.