శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:11 IST)

ఏపీలో 86.16 లక్షల కార్డుదారులకు నిత్యవసర సరుకుల సరఫరా

గతనెల మార్చ్ 29 తేదీ నుండి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం నాటికి 86 లక్షల 16 వేల 639 కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

ఈ కార్డుల్లో పోర్టబులిటీ ద్వారా తీసుకున్నవి 19 లక్షల 09 వేల 084 కార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్డులకు ఒక లక్ష 38 లక్షల 347 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 7, 926 మెట్రిక్ టన్నుల కందిపప్పు ను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

ఈ మేరకు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు 69 లక్షల 78 వేల 517 రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామన్నారు. వీటిలో పోర్టబులిటీ ద్వారా తీసుకున్న కార్డులు మరో 14 లక్షల 92 వేల 590 కార్డులు ఉన్నాయన్నారు.

అలాగే బుధవారం 16 లక్షల 38 వేల 122 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో పోర్టబులిటీ ద్వారా తీసుకున్నవి మరో 4 లక్షల 16 వేల 494 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1 వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఉచితంగా ఒక లక్ష 11 వేల 639  మెట్రిక్ టన్నుల బియ్యం, 6 వేల 338 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు.

అలాగే గురువారం రేషన్ కార్డుదారులకు 26 వేల 707 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1, 588 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఉచితంగా సరఫరా చేశామన్నారు. రాష్ట్రంలోని ఒక కోటి 47 లక్షల 24 వేల 017 రేషన్ కార్డు దారులు అందరికీ నిత్యావసర సరుకులను అందజేసే వరకు రేషన్ షాపులన్నీ తెరిచే ఉంటాయని మంత్రి కొడాలి నాని తెలిపారు.