శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (07:36 IST)

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునివ్వండి... టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులిచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ కి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.