గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (16:23 IST)

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంలో చుక్కెదురు.. ఏపీ సర్కారుకు నోటీసు!

anantha babu
తన వ్యక్తిగత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ఏపీకి చెందిన అధికార వైకాపా ఎమ్మెల్యే అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రాజమండ్రి కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులు అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సోమవారం విచారణకు వచ్చింది. 
 
ఆ తర్వాత అనంతబాబు బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. 
 
ఇదిలావుంటే, ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను ప్రభుత్వానికి, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదావేసింది.