శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:36 IST)

అందుకే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు : పరిపూర్ణానంద

వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.

ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒత్తిడిని తట్టుకోలేకనో... ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకనో.. ప్రేమ విఫలమయ్యో ఇలా ఏదో ఒకవిధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. 
 
దేవాలయం కేంద్రంగా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామి సేవలో అర్చకులు అతీతులు కారని... అపచారాలు చేస్తే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు. 
 
ఇకపోతే, రాజకీయాల్లోకి తాను ప్రవేశించడం కాదు.. తనలో, తన చుట్టుపక్కల రాజకీయం ప్రవేశించిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాగా, కత్తి మహేష్ ఎపిసోడ్‌లో చిక్కుకున్న స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే.