గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (09:29 IST)

పెయిడ్ ఆర్టిస్టుకు పర్యాయపదం అక్రమ(విజయ)సాయిరెడ్డి : బుద్దా వెంకన్న

వైకాపా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. "ఓదార్పు యాత్ర పేరుతో ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ మీ మహా మేతగారి తనయుడు జూనియర్ మేతగారు నాన్నారు కోసం చనిపోయారు అంటూ చాంతాడు అంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేశారు. 

ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తర్వాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు. మిగిలిన వారు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? పైయిడ్ ఆర్టిస్ట్‌కి పర్యాయపదం మీరు అక్రమ సాయి రెడ్డి రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచిన మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.