శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (10:07 IST)

టీటీడీ నియామకాన్ని వెనక్కి తీసుకోండి.. బాబుకు అనిత లేఖ

పాయకారావుపేట ఎమ్మెల్యే అనిత హిందువు కాదని.. క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన నియామకాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు అనిత లేఖ రాశారు. దీంతో మూడు రోజుల పాటు సాగిన ఈ వివాదానిక

పాయకారావుపేట ఎమ్మెల్యే అనిత హిందువు కాదని.. క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన నియామకాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు అనిత లేఖ రాశారు. దీంతో మూడు రోజుల పాటు సాగిన ఈ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. టీటీడీ ఉద్యోగం తనకు వద్దన్న తరహాలో అనిత చంద్రబాబుకు లేఖ రాశారు. క్రిస్టియన్ అంటూ వివాదం తలెత్తడంతో అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
తన కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టం లేదని, తాను ముమ్మాటికీ హిందువునేనని.. క్రిస్టియన్ కాదని అనిత లేఖలో పేర్కొన్నారు. తన ఇష్టదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అని.. తాను అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని చెప్పుకొచ్చారు. కొన్ని గ్రూపులు అదే పనిగా తనను టార్గెట్ చేసి అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని.. అందుకే ఈ నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని అనిత ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. టీటీడీ చైర్మన్ మొదలుకుని.. పాలకమండలి సభ్యులను ఇటీవల సీఎం చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాలకమండలి సభ్యుల్లో ఎమ్మెల్యే అనితకు చోటు దక్కింది. కానీ టీటీడీ మెంబర్‌గా అనితను నియమించిన కొన్నినిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువెత్తాయి. అనిత తనను తాను క్రిష్టియన్ అని ఆ వీడియోల్లో చెప్పుకున్నట్లు ఉంది. దీంతో అనితపై విమర్శలు రావడంతో టీటీడీ నియామకం నుంచి తనను తప్పించాలని బాబుకు ఆమె లేఖ రాశారని టాక్ వస్తోంది.