శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:02 IST)

ఎమ్మెల్యే చింతమనేని చిందులేయడానికి కారణమేంటంటే...

అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మంత్రి పదవికి ఆశపడి భంగపాటుకు గురయ్యారు. అంతేనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మంత్రి పదవికి ఆశపడి భంగపాటుకు గురయ్యారు. అంతేనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో కార్యకర్తలనుద్దేశించి చింతమనేని మాట్లాడుతూ... ఇతర పార్టీల్లో చేరబోనని, అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. 
 
అసలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తికి ప్రధాన కారణం ఏంటో ఓసారి పరిశీలిస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడమేనని సమాచారం. పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై దెందులూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా చివరి వరకు చింతమనేనికి మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చినప్పటికీ చివరి క్షణంలో పితాని పేరు తెరపైకి రావడం, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో దెందులూరుకు చెందిన టీడీపీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. పితాని సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చింతమనేనిపై అనేక కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇలా ఇస్తారని దెందులూరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే చింతమనేని ఆగ్రహానికి అసలు కారణంగా ఉంది.