శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (16:31 IST)

'ఆర్థిక ఉగ్రవాది'ని ప్రధాని కలుసుకోవడం దురదృష్టకరం : టీడీపీ ఎమ్మెల్సీ

ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరమని అధికార టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విజయవాడల

ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరమని అధికార టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ..... ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ఎండల నుంచి తప్పించుకునేందుకు అక్కడకు వెళ్లారంటూ మాట్లాడటం జగన్‌ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. 
 
ఆదాయానికి మించి ఆస్తులు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నేతల కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన మరుసటి రోజే జగన్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరడం గమనార్హమన్నారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులో ఒక న్యాయమూర్తిని నియమించి శిక్షలు విధించాలని, ఆరు నెలల్లోపు విచారణలు పూర్తి కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వైవీబీ గుర్తు చేశారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని వద్దకు జగన్ పరుగుపెట్టారని ఆయన ఆరోపించారు.