Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లైట్ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై జేసీ దివాకర్ వీరంగం.. ప్రయాణాలపై నిషేధం తప్పదా?

గురువారం, 15 జూన్ 2017 (14:15 IST)

Widgets Magazine
jc diwakar reddy

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు. చివరి నిమిషంలో వచ్చిన తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలంటూ ఒత్తిడి చేశారు. అయితే, సమయం మించిపోయిందని చెప్పిన సిబ్బంది కౌంటర్ మూసివేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ... కౌంటర్‌లోని టిక్కెట్ ప్రింటింగ్ యంత్రాన్ని పగులగొట్టారు. ఈ సంఘటన గురువారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్‌ పాస్‌ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
 
కాగా, ఇటీవల ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేసిన వ్యవహారంలో శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని ప్రైవేటు విమాన సంస్థలు కూడా అమలు చేశాయి. దీంతో దిగివచ్చిన గైక్వాడ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఇపుడు ఎయిర్‌పోర్టులో దౌర్జన్యం చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవచ్చన్న పలువురు అభిప్రాయపడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడేళ్ల ప్రాయంలో తల్లికి దూరమైంది.. 44వ ఏట కన్నతల్లికి చేరువైంది.. ఎలా?

మూడేళ్ల ఏళ్ల ప్రాయంలో కన్నతల్లికి దూరమై.. విదేశాలకు వెళ్ళిపోయిన కుమార్తె... 41 ఏళ్ల ...

news

గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరితీయాలి : సాధ్వీ సరస్వతి

గోడ్డు మాంస విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తగా చర్చ ...

news

ఎర్రకోట భారత్‌ది కాదు.. పాకిస్థాన్‌ది : చైనా చాయాచిత్రాల పదర్శనలో అపశృతి

చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది ...

news

కన్నడ నటికి చుక్కలు చూపించిన టెక్కీ.. స్నేహం-ప్రేమ- సహజీవనం.. చివరికి పెద్దలు వద్దన్నారని?

కన్నడ నటికి ఓ టెక్కీ ముఖం చాటేశాడు. కన్నడనటితో స్నేహం చేసి.. ఆమెను ప్రేమించి.. ఆపై ...

Widgets Magazine