శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (16:53 IST)

పెట్రోల్, డీజిల్ పై రూ.4 అదనపు వ్యాట్ తగ్గించాలి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్రోల్ , డీజిల్ పై వేస్తున్న అద‌న‌పు వ్యాట్ 4 రూపాయ‌లు వెంట‌నే త‌గ్గించాల‌ని టిడిపి నిర‌స‌న దీక్షలు ప్రారంభించింది. కృష్ణా జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రబోయిన ఆధ్వర్యంలో న‌గ‌ర వీధుల్లో ఆందోళన చేశారు. 
 
నూజివీడు పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధరలు దిగిపోవాలి అంటే, జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఒక ద‌శ‌లో పోలీసుల‌కు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.