పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన టిడిపి.. ఎలా?
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:47 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ విమర్శల తరువాత మూకుమ్మడిగా ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఆ తరువాత జనసేన, టిడిపి నేతలు సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కూడా ఒకరిపైన ఒకరు అంత స్థాయిలో విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. హోదా కోసం కేవలం కమ్యూనిస్టులతో మాత్రమే కలిసి పోరాడాలని జనసేన పార్టీ అధినేత పిలుపునిచ్చారు. దీంతో ఎపిలోని 13 జిల్లాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు కమ్యూనిస్టులతో కలిశారు.
అధికార తెలుగుదేశం పార్టీ వైఫల్యాలపై కమ్యూనిస్టులు మాత్రమే విమర్శలు చేస్తుంటే జనసేన పార్టీ నేతలు సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. కానీ టిడిపి నేతలు మాత్రం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పవన్‌ను టార్గెట్ చేయబోతున్నారు. తిరుపతి వేదికగా తారకరామ స్టేడియంలో జరిగే ప్రత్యేక హోదా ఉద్యమంతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయాలని, ఆ తరువాత హోదా వచ్చేంత వరకు కూడా పవన్ కళ్యాణ్‌ను తిడుతూనే ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారట.
ఇప్పటికే ఇదే విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సమావేశం కూడా అయ్యారు. తారకరామ స్టేడియంలో అప్పట్లో మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడంతో అందులో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యంగా ఉండటంతో దాన్నే టార్గెట్ చేసుకొని మాట్లాడాలన్న ఆలోచనలో ఉన్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు. మొత్తంమీద టిడిపి నేతలు ఆరోపణలు చేస్తే జనసేన పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారన్నదే ఆసక్తికరంగా మారుతోంది.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,