శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (13:10 IST)

ఎక్కాలు రాయలేదనీ విద్యార్థి బుగ్గలు వాచిపోయేలా చెంపదెబ్బలు కొట్టిన పంతులమ్మ!

గురువు అంటే పాఠం చెప్పేవాడు. శిష్యుడు అంటే పాఠం వినేవాడు. అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాంటిది చిన్నారులకు ప్రేమగా పాఠాలు చెప్పాల్సిన టీచరే సహనం కోల్పోయి మృగంలా ప్రవర

గురువు అంటే పాఠం చెప్పేవాడు. శిష్యుడు అంటే పాఠం వినేవాడు. అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాంటిది చిన్నారులకు ప్రేమగా పాఠాలు చెప్పాల్సిన టీచరే సహనం కోల్పోయి మృగంలా ప్రవర్తించింది. ఎక్కాలు సకాలంలో రాయలేదన్న కోపంతో రెండో తరగతి విద్యార్థి చెంపలు వాసేలా కొట్టింది. ఈ సంఘటన వలేటివారిపాలెం మండలంలోని నూకవరం ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
 
గ్రామానికి చెందిన పొనుగోటి రాజు రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం పంతులమ్మ విద్యార్థులకి రెండో తరగతి ఎక్కాలు రాయడానికి పది నిమిషాల సమయాన్ని కేటాయించింది. ఇచ్చిన సమయంలో అందరూ పూర్తి చేశారు. కానీ రాజు సకాలంలో రాయలేకపోవడంతో ఉపాధ్యాయురాలికి కోపం కట్టలు తెంచుకుంది. రాజుని గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు. దీంతో రాజు బుగ్గలు గులాబీ పువ్వులా కందిపోయాయి. 
 
టీచర్ ఆగ్రహానికి బిత్తరపోయిన రాజు... చడీచప్పుడు కాకుండా పాఠశాల నుంచి పరుగో పరుగున పారిపోయాడు. సాయంత్రం అయిన కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెతుక్కుంటూ పాఠశాలకు వచ్చారు. అక్కడ లేకపోవడంతో ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ కనపడలేదు. చివరకు పొలాల్లో కనిపించిన రాజు.. అసలు విషయం చెప్పడంతో టీచర్ గుట్టురట్టయ్యింది. సదరు ఉపాధ్యాయురాలు గతంలో కూడా ఇదేవిధంగా వేరే విద్యార్థిని చితకబాదిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాజు తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.