హైవేపై అడ్డంగా ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్...

cbn convoy car
ఎం| Last Updated: శుక్రవారం, 13 నవంబరు 2020 (20:23 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన జాతీయ రహదారిపై సుమారు 20 నిమిషాల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళితే… విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నార్కట్‌పల్లికి రాగానే చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు సాంకేతిక కారణాల వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆయన నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన హైదరాబాద్ బయలు దేరారు.

వాస్తవానికి ప్రతి 20 వేల కిలోమీటర్లకు ఒకసారి కారు క్లచ్ ప్లేట్స్‌ను మార్చాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన కారును ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ కారు 60 వేల కిలోమీటర్లకు పైగా చంద్రబాబు ప్రయాణించే మెయిన్ క్వానయ్ తిరగడం గమనార్హం.దీనిపై మరింత చదవండి :