శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (09:19 IST)

14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక (14)పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు యువకుడు. అనంతరం వెంటనే మరో ఇద్దరు యువకులకు సమాచారం ఇచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.