Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాడు బద్ధశత్రువులు.. నేడు బెస్ట్ ఫ్రెండ్స్ : కేసీఆర్‌తో పయ్యావుల ఏకాంత చర్చలు!

ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:16 IST)

Widgets Magazine
payyavula keshav

తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్యావుల తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతపురం వేదికగా చేసుకుని విద్యార్థులతో ఉద్యమం కూడా నడిపారు. దీంతో కేసీఆర్, పయ్యావులలు బద్ధశత్రువులుగా మారారు. 
 
అయితే, అదంతా గతం. రాష్ట్ర విభజన జరిగిపోయి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ వివాహా వేడుకకు హాజరైన కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో కొంచెం సేపు మాట్లాడినట్టు సమాచారం. ఐదారు నిమిషాల పాటు ఆయనతో కేసీఆర్ ఏకాంతంగా సంభాషించారని, ముఖ్యంగా, ఏపీ రాజకీయాలపై, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించీ పయ్యావులతో కేసీఆర్ మాట్లాడినట్టు వినికిడి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లాడెన్ తరహాలో కిమ్ జాంగ్ ఉన్‌ను చంపేందుకు అమెరికా ప్లాన్..

అంతర్జాతీయ ఉగ్రవాది అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్టుగానే ఉత్తర కొరియా ...

news

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...

దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ ...

news

సొంతింటికి దందా ప్రారంభించిన రోజా - బెదిరింపులకు దిగుతూ...

ఫైర్ బ్రాండ్ ఆర్కే.రోజా.. ఏది చేసినా సంచలనమే. ఏది మాట్లాడినా వివాదాస్పదమే. దూకుడుగా ...

news

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకే చెప్పని వై.ఎస్.జగన్

వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని ...

Widgets Magazine