Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ

గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:24 IST)

Widgets Magazine
kcr - babu

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. కేసీఆర్ శుభాకాంక్షలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతకాలం గడిచినా.. తెలుగు ప్రజలు కలిసుండాలని తాను కోరుకుంటున్నట్లు బాబు ఆశించారు.  
 
కాగా హైదరాబాద్‌లో బాబు జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకలకు తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, రావుల, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే ఏపీలోనూ బాబు బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అనంతపురం జిల్లా పామిడిలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రానికి పోలవరం అత్యంత ప్రధానమైన ప్రాజెక్టని, నెహ్రూ నుంచి చంద్రబాబు వరకూ ఎందరో కలలు కన్న ప్రాజెక్టు అని.. తన శక్తియుక్తులతో పోలవరం ప్రాజెక్టును సాధించిన ఏపీ సీఎం చంద్రబాబు హ్యాట్రాఫ్ అన్నారు.   
 
ఇంకా 'చిరంజీవి చంద్రబాబునాయుడు..' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తాను ఎందుకు ముఖ్యమంత్రిని చిరంజీవి అంటున్నానో చెప్పుకొచ్చారు. బాబుకేమో 68వ జన్మదినోత్సవం.. తనకేమో 72. అందుకనే సీఎంను చిరంజీవి అని సంబోధిస్తున్నానని తెలిపారు. నీటి విషయంలో చంద్రబాబు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, ప్రజలంతా కూడా మెచ్చుకుంటున్నారని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడులో బిజెపి గేమ్... ఎందుకు...?

తమిళనాడు వ్యవహారంలో తాము తలదూర్చలేదని కేంద్రమంత్రులు పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్రం ...

news

భానుడి ప్రతాపం: వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 48 మంది మృతి.. మధ్యాహ్నం వేళల్లో ఎమెర్జెన్సీ

భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి ...

news

చంద్రబాబు దొంగనా? పోలవరం నిధుల ఖర్చుపై మరో కమిటీ.. స్వయంగా నిఘా పెట్టిన మోడీ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మడం లేదా? ...

news

మగాడితో లేచిపోతూ ప్రేయసి చెప్పిన కారణంతో దొంగగా మారిన 65 యేళ్ల వృద్ధుడు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో లేచిపోతూ ...

Widgets Magazine