గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (09:03 IST)

జగన్ .. ఒక మూర్ఖుడు - మానసిక రోగి : మండిపడిన రేణుకా చౌదరి

renuka chowdhury
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు.
 
అసలు జగన్ మోహన్ రెడ్డి 'స్కిల్ డెవలప్ మెంట్'కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు. మోసాలు చేయడానికి, బాబాయ్‌ని చంపుకోవడంలోనూ, తండ్రి శవం వద్ద సంతకాల కోసం ప్రయత్నించడంలోనూ ఆయన 'స్కిల్' అందరికీ తెలిసిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. అధికార దాహంతో జగన్ రొప్పుతున్నాడని, అతి త్వరలో అతడి మదం తగ్గుతుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
 
'ఆ సీఐడీ పోలీస్ సంస్థ ఏంటండీ బాబూ... ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? జగన్ ఒక మెంటల్ కేసు. రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకు ఇలాంటి నాయకులకు మానసిక వైద్య పరీక్షలు చేసి, మానసికంగా సరిగ్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారించాలి. ఇంతవరకు ఒక్క రాజధానే రాలేదు కానీ, మూడు రాజధానులు అని మాట్లాడిన మూర్ఖుడు జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇలాగేనా?' అంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.