Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కలెక్టర్ ఆమ్రపాలి 'ఇట్స్ ఫన్నీ'పై తెలంగాణ సర్కారు సీరియస్

మంగళవారం, 30 జనవరి 2018 (08:36 IST)

Widgets Magazine
Amrapali

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్యమధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూడటం వంటి వెకిలి చేష్టలు చేశారు. హన్మకొండలోని పరేడ్ మైదానంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆమె ప్రసంగిస్తూ అకారణంగా నవ్వడం, సంబంధిత అంశాలకు సంబంధించిన గణాంకాలను ప్రకటించేటప్పుడు తడబడటం చేశారు. అంతేకాకుండా, ప్రసంగం మధ్యలో 'ఇట్స్ ఫన్నీ' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై విమర్శలు తలెత్తాయి. ఈ వీడియోను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ స్వయంగా ఆమ్రపాలికి ఫోన్ చేసి మందలించినట్టు సమాచారం. 
 
ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ఆమెను హుందాగా వ్యవహరించాలని సూచించారని సమాచారం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆమ్రపాలి చెప్పినట్టు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ఇదిలావుంటే, ఈనెల 18వ తేదీన తన కంటే ఓ యేడాది చిన్నవాడైన ఢిల్లీ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం జరుగనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం ...

news

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు... మంత్రి అభినందనలు

అమరావతి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ ...

news

పవన్ కళ్యాణ్‌ చేసేది పాజిటివ్ రాజకీయమే, తితిదేలో అలా ఎందుకు జరుగుతోంది... సిపిఐ నేత రామక్రిష్ణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు సిపిఐ నేత రామక్రిష్ణ. కేంద్ర ...

news

పొదల మాటున ఆ పని కుదరదు-ఆ పార్కుకు వస్తే అది తప్పనిసరి

నగరాల్లోని పబ్లిక్ పార్కుల్లో ప్రేమజంటలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పార్కులకు వచ్చే ...

Widgets Magazine