ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసిన హోంగార్డు...
ఓ హోం గార్డు ప్రేమ పేరుతో ఓ యువతిని వంసించాడు. ఆ యువతిని గర్భవతిని చేసి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నరు. ఈ ఘటన కుమరం భీమ్ జిల్లా అసిఫాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అసిఫాబాద్‌కు చెందిన సజ్జన్‌లాల్ అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన అరుణ అనే యువతిని ప్రేమ పేరుతో రంగంలోకి దించాడు. ఆ తర్వాత ఆ యువతికి మాయమాటలు, పెళ్లి చేసుకుంటానని నమ్మంచి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆ యువతి గర్భందాల్చింది.
ఈ క్రమంలో పురిటినొప్పులతో బాధపడుతున్న అరుణను పలు ఊర్లు తిప్పాడు. అయితే ఆదివారం నాడు మార్గ మధ్యలో శిశువుకు జన్మనిచ్చిన అరుణ తుదిశ్వాస విడిచింది. శిశువును, అరుణ మృతదేహాన్ని అసిఫాబాద్ ఆస్పత్రిలోనే వదిలేసి సజ్జన్‌లాల్ పరారయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న అరుణ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. సజ్జన్‌లాల్ వల్లే అరుణ చనిపోయిందని బంధువుల ఆందోళన బాట పట్టారు. హోంగార్డును కఠినంగా శిక్షించాలని అరుణ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.