శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:30 IST)

తెలంగాణ రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో గోదాంల కొరత.. రూ.1000కోట్లతో నిర్మాణం..

నాబార్డ్ సహకారంతో 1000 కోట్ల రూపాయలతో గోదాంల నిర్మాణం చేపడతామని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రూ.21.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాం కొరత ఉన్నట్లు తెలంగాణ సర్కారు అంచనా వేసింది.

శుక్రవారం మార్కెటింగ్ శాఖపై  తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. త్వరలో గోదాంల నిర్మాణం కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు తయారు చేయనున్నట్టు చెప్పారు. 
 
ఇప్పటివరకు 76 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్టు చెప్పారు. రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు అందేలా చర్యలు చేపడుతామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో 51 మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు కూరగాయల అమ్మే సౌలభ్యం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.