శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (13:37 IST)

హైదరాబాదులో సైకో కిల్లర్.. ఒంటరి మహిళలే టార్గెట్.. మొహంపై పెట్రోల్ పోసి..?

హైదరాబాదులో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా రాచకొండ పోలీసులు సైకో కిల్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కిరతంగా హత్య చేసిన కేసులో ఈ సైకోను అదుపులోకి తీసుకున్నారు. వెంకటమ్మను దారుణంగా హత్యచేసి.. మొహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు సైకో.. ఈ కేసులో 20 రోజుల పాటు దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు.
 
అలాగే బొరబండకు చెందిన ఓ వ్యక్తిని కూడా హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. దారుణంగా హత్య చేస్తుండాని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కీలక సమాచారం సేకరించారు పోలీసులు.. విచారణలో 16 మంది మహిళలను హత్య చేసినట్టు సైకో ఒప్పుకున్నాడని చెబుతున్నారు.
 
కల్లు దుకాణాలు, మద్యం షాపుల దగ్గర ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకుని ఈ హత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు.. మద్యం మత్తులో ఉన్నవారితో మాటలు కలిపి.. వారిని తన దారిలోకి తెచ్చుకునే సైకో.. వారిని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి దారుణాలకు ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు.