గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (19:06 IST)

కేసీఆర్ మగాడ్రా బుజ్జీ.. బండ్ల గణేష్ బ్లేడుతో మెడ కోసుకుంటానన్నాడు.. పృథ్వీ

ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోతే.. బ్లేడుతో మెడ కోసుకుంటానని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్లగణేష్ చెప్పారని.. ఆయనను కాపాడాలని పోలీసులకు చెప్పాలని.. నటుడు పృథ్వి సెటైర్లు వేశారు. బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలని ఎద్దేవా చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ చాలా విచిత్రంగా ప్రవర్తించాడన్నారు. 
 
అమెరికా అధ్యక్షుడితో కూడా గణేష్‌కు ఫోటో దిగే శక్తి వుందని పృథ్వీ ఎద్దేవా చేశారు. కానీ బండ్ల గణేష్ మంచి నిర్మాత అని, తనకు మంచి స్నేహితుడని పృథ్వీ చెప్పుకొచ్చారు. అధికారం కోసమే మహాకూటమి ఏర్పడిందన్నారు. 
 
తెలంగాణలో మహాకూటమికి ఓటు వేస్తే పరిపాలన అమరావతి నుంచి వుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి వుంటే కేవలం ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మగాడని.. విజయమే లక్ష్యంగా ఆయన జర్నీ వుంటుందని పృథ్వీ నొక్కి చెప్పారు.