ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (17:43 IST)

మీకు నచ్చిందే చెప్పాలనడం చాలా అన్యాయం అన్నా, ఉన్నదే చెప్పాను: యాంకర్ శ్యామల

Anchor Shyamala
Anchor Shyamala
2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న యాంకర్ శ్యామల.. ఆ పార్టీ విజయం కోసం గట్టిగానే పనిచేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు శ్యామల. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు ఏపీలో కూటమికి అనుకూలంగా వచ్చాయి. వైకాపా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. 
 
ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. "ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ముందుగా అఖండ విజయాన్ని నమోదు చేసిన కూటమికి శుభాకాంక్షలు. 
 
పెద్దలు చంద్రబాబు గారికి, పవన్ కల్యాణ్ గారికి, పురందేశ్వరి గారికి అభినందనలు. అదే వైసీపీ గెలుపుకోసం కస్టపడ్డ కార్యకర్తలు అందరికీ థ్యాంక్స్. 
 
ఈ అయిదేళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను"అంటూ శ్యామల తెలిపారు. అలాగే ఇక చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు శ్యామల. ఒక రకమైన భయంగా ఉందన్నారు.