Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డ్రగ్స్ దందా: అకున్ సబర్వాల్ సెలవులు రద్దు.. కస్టడీలోకి కెల్విన్‌..

శనివారం, 15 జులై 2017 (11:33 IST)

Widgets Magazine

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పది రోజుల పాటు సెలవులు వేయడం సబబు కాదని అందరూ భావించారు. విపక్షాలు సైతం డ్రగ్స్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాసిన ఆయన పదిరోజులు లీవు పెట్టి వెళ్లడంపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి తగ్గారు. వక్తిగత సెలవులను రద్దు చేసుకున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన సెలవు వాయిదా వేసుకున్నారు. 
 
అకున్ సబర్వాల్ సెలవుపై వెళితే, ఆయన స్థానంలో ఈ కేసును ఎవరు డీల్ చేస్తారంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో, కాస్త ఇబ్బందికి గురైన ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసినట్టు సమాచారం. నేటి నుంచి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు అకున్‌కు సెలవులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం వాటిని అకున్ రద్దు చేసుకున్నారు. కాగా ఇప్పటికే డ్రగ్స్ కేసులో 12 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో నోటీసులు అందిన వారిని సిట్ వ్యక్తిగతంగా విచారించనుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డీలర్ కెల్విన్‌ను ఎక్సైజ్ సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది. హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో ఉన్న కెల్విన్‌ను విచారణ నిమిత్తం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆడ ఆఫీసర్ నోరిప్పకూడదట. మగాఫీసరు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు.. ఇదేందప్పా సిద్ధప్పా

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మగ పోలీసు అధికారిని వెనకేసుకు వస్తూ అతడి ...

news

ఐస్‌క్రీమ్‌లు కొనేందుకు వెళ్ళిన బాలికను పెళ్లాడి.. గర్భవతిని చేశాడు..

బాలికలపై దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ...

news

మనసు విరిగిపోయిన షర్మిల.. ఇక ఆ బంధమే వద్దనేసింది

తన ప్రాంత మహిళలను అత్యాచారాలు చేసి మరీ చంపుతున్న భారత సైన్యంపై పదహారేళ్లపాటు నిరాహార్ ...

news

జైలుపాలయ్యారా.. దండిగా డబ్బుందా.. అయితే కొండమీద కోతి కూడా దిగొస్తుంది

డబ్బున్న మారాజులు, మారాణిలకు భారత దేశంలో జైళ్లు స్వర్గధామాలని, కోరిన కోరికలు అందులో ...

Widgets Magazine