శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (17:11 IST)

టెన్షన్ టెన్షన్.. కుప్పంలో రఘువీరను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు...

ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని నిలిపేశారు. ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సంఘటన వివరిలిలా ఉన్నాయి. 
 
కుప్పం నియోజకవర్గంలోని శాంతీపురం మండలంలో ఏడో మైలు వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భూ సేకరణ చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వారితో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. రఘువీరారెడ్డి కుప్పం మండలం లక్ష్మీపురం వద్దకు చేరుకోగానే తెదేపా శ్రేణులు ఆయను అడ్డుకున్నాయి.
 
వెళ్లడానికి వీల్లేందంటూ ఆయన వాహనాలకు అడ్డు నిలబడ్డారు. ఈ సందర్భంగా తెదేపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విమానాశ్రయ భూముల రైతులను కలిసి విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు అడ్డంపడుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు రఘువీరను నిలదీశారు. ఈ సందర్భంగా మరోమారు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో బందోబస్తు నడుమ రఘువీరారెడ్డిని అక్కడి నుంచి పంపించారు.