గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (09:45 IST)

టీడీపీ నేతపై బహిష్కరణ వేటు.. ఎక్కడ .. ఎందుకు?

tdpflag
శ్రీ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజవర్గానికి చెందిన టీడీపీ నేత మద్దరెడ్డి కొండ్రెడ్డిపై జిల్లా కలెక్టర్ బహిష్కరణ వేశారు. ఆర్ను నెలల పాటు ఆయన జిల్లాలోకి రాకూడాదని జిల్లా కలెక్టర్ గిరీష్ ఆదేశాలు జారీచేశారు. 
 
కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. జిల్లా ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
అలాగే, కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించినట్టు పేర్కొన్న కలెక్టర్.. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం 1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద కొండ్రెడ్డిన గూండా పరిగణించవచ్చని తెలిపారు. 
 
దీంతో తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డిని బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే జిల్లా కలెక్టర్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన రోజు నుంచి ఆర్నెల్లపాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. అదేసమయంలో కొండ్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.