సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (08:41 IST)

హోరెత్తుతున్న అమరావతి ఉద్యమగీతం

‘మూడు ముక్కలాటలొద్దు పాలకులారా?..మా జీవితాల్తో ఆటలొద్దు పాలకులారా?’ అంటూ రాజధాని రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా ఒక ఉద్యమ గీతం  సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది.

6.13 నిమిషాల నిడివితో ఉన్న గీతంలో అమరావతికి ప్రధాని శంకుస్థాపన నుంచి.. ప్రస్తుత పరిణామాల వరకూ ప్రస్తావించారు. ‘రాజధాని మార్పుపేర మా బతుకులు బుగ్గిచేస్తే.. భూమిచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే... ఊరుకోము మేమంతా పాలకులారా?..ఊరువాడ కదిలొస్తాం పాలకులారా? ఉప్పెనై లేచొస్తాం పాలకులారా? ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా?’ అంటూ సాగుతుంది.

‘అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తామంటే.. బువ్వపెట్టే రైతన్న భూమినిచ్చినాడన్నా.. ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే..సంబరపడి మేమంతా సంబరాలు చేశాము..చంద్రబాబుకివ్వలేదు పాలకులారా..భూమి సర్కారుకిచ్చినాము పాలకులారా?’ అనే చరణాలు ఈ గీతంలో ఉన్నాయి.