శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (18:55 IST)

దళితులు, మైనార్టీల అణచివేతకు కొన్ని శక్తుల కృషి

ప్రస్తుతం భారతదేశంలో దళితులు మైనార్టీ ప్రజల పట్ల కొన్ని శక్తులు అణచివేతకు తమ శక్తియుక్తుల కృషి చేస్తున్నాయని. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోటానికి సిద్ధమవ్వాలి అని ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంజూరు ఆలం అన్నారు.

గత రెండు రోజుల నుంచి  ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ సమావేశాలు రామవరప్పాడు వద్ద ఉన్న కే హోటల్ జరుగుతున్నాయి. భారతదేశంలోని సుమారు 170 మంది ప్రతినిధులు 27 రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. శనివారం నాడు జరిగిన 20 వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఎదుటి వారిని రెచ్చగొట్టి దేశంలో నెలకొన్న శాంతి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతినేలా గా కొందరు పని చేస్తున్నారన్నారు.

నోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది అన్నారు. ముస్లింలను రెండవ తరగతి విభజించి అణచివేయాలని చూడటం దారుణం అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు సార్ధకత కు వాటి అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భారతదేశం యొక్క చట్టాల పట్ల తమకు గౌరవం ఉందన్నారు. మూక దాడులపై సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే  నాయ్యపరంగా పోరాటం చేయాలన్నారు.

దేశంలో ఏవి శాంతి స్థాపనకు కృషి చేస్తాయో వాటికి మద్దతు పలకాలన్నారు.ఈ దేశంలో ఉన్న పీఠాధిపతులు మిగతా వారితో కలిసి శాంతి స్థాపనకు ముందుకు రావాలన్నారు. మరో ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భాష మాట్లాడుతూ.. ఈ దేశంలో స్వాతంత్రం తేవడంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు.

దేశ స్వాతంత్ర్య సముపార్జన కొరకు ప్రాణ త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులతో సమానంగా  ముస్లిం మేధావులు, మత పెద్దలు మరియు సామాన్య ప్రజలు సైతం ఆడ మగ తేడా లేకుండా ప్రాణాలర్పించారు. 
 
ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిచే రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసామ్య దేశమైనా మన భారతదేశంలో ప్రతి ఒక్క మతం మరియు కులంవారు తమ మతాచారాలు మరియు సాంప్రదాయాలను స్వేఛ్చగా ఆచరించుకొనే వేసలుబాటును కల్పించింది. 
 
కానీ, కొన్ని ప్రభుత్వాలు ముస్లింల షరియత్ మరియు ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ముస్లిములను రెండవ శ్రేణి పౌరులుగా భావించడం బాధాకరమన్నారు.

చివరగా, మన దేశంలోని ముస్లిములు ఎదుర్కుంటున్న అనేక సమస్యలలో నిరక్షరాస్యత, పేదరికం మరియు వరకట్న దురాచారం మరియు నిరుద్యోగంలాంటి సమస్యలపై ప్రభుత్వాలతో కలసి ప్రజాసామ్య పద్ధతులలో పరిష్కరించుకోవడానికి మరియు భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 
 ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్యెల్యే హఫీస్ ఖాన్, మరియు అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సా అలాం ఆబ్దుల్లాహ్ ముగాయస్. మరీయు ఏపి మీడియా ఇంచార్జీ ఫారూఖ్ షూబ్లీ  ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సులేమన్ నద్వి కార్యదర్శి అబ్దుల్ ఖధర్రీ  సుప్రీంకోర్ట్  నాయవది జిలానీ, కార్యక్రమ కన్వీనర్లు శూకూర్, హుస్సిన్ మౌలానా, పెద్దఎత్తున మత పెద్దలు పాల్గొన్నారు.