శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (20:53 IST)

హాస్టల్‌లో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే అబ్బాయిలను పంపించారు, ఎక్కడ?

కొంతమంది వ్యక్తులు లేడీస్ హాస్టల్లో చొరబడటం కలకలం రేగుతోంది. ఒక యువతి బట్టలు మార్చుకుంటుండగా మగవాళ్ళు గదిలోకి ప్రవేశించి చూశారంటూ ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని మై హోం లేడీస్ హాస్టల్ లీజు వివాదంలో ఉంది. లీజుకు తీసుకునే హాస్టల్ నడుపుతున్న వారిని ఖాళీ చేయాలంటూ యజమాని కొంతకాలంగా బలవంతపెడుతున్నాడంటూ వార్త. 
 
లీజు గడువు పూర్తి కాకముందే నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ భవనం అద్దె రేటు పెంచారని ఆరోపించారు హాస్టల్ నిర్వాహకులు. ఈ వివాదం కొనసాగుతుండగానే భవనం యజమానికి చెందిన వ్యక్తులు లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించడం. అదే సమయంలో యువతి బట్టలు మార్చుకుంటుండటంతో వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించి సి.సి.ఫుటేజ్ వివరాలు కూడా హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమర్పించారు. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.