గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:06 IST)

జెసి సోదరులు గెలిచారు

మొత్తం 75 మున్సిపాల్టీల్లో టిడిపి గెలిచింది..ఒకే ఒక్కటి..అది ఎక్కడంటే..ఫ్యాక్షన్‌ జిల్లా 'అనంతపురం'లోని 'తాడిపత్రి'. ఇక్కడ టిడిపి గెలిచిందనే దాని కంటే 'జెసి సోదరులు' గెలిచారంటే సబుబేమో..!? ఎన్నివేధింపులు ఎదురైనా..ఎన్నిసార్లు అరెస్టు అయినా..కరోనా సమయంలో జైలులో పెట్టినా పార్టీని గెలిపించాలనే మొండిపట్టుదలతో 'జెసి బ్రదర్స్‌' పోరాడారు.

పోరాటానికి ఫలితం సాధించి చూపెట్టారు. ఇవాళ టిడిపిలో హీరో ఎవరంటే ఖచ్చింతగా 'జెసి ప్రభాకర్‌రెడ్డే'నని చెప్పాలి. టిడిపిలో మిగతా నాయకులవలే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడ్ని ఎన్నికల బరిలో దించారు. ఆయన ఓడిపోయినా..'తాడిపత్రి' మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా చేసుకుని గెలిచిచూపించి తాము మిగతా టిడిపి నాయకుల కంటే భిన్నమని నిరూపించారు.

తండ్రుల గొప్పలు చెప్పుకుని హీరోలమని తిరిగిన నాయకులు ప్రతిపక్షంలోకి రాగానే ఇంటిలో దూరి బయటకు రాకుండా సేఫ్‌ గేమ్‌ ఆడుతుంటే 'జెసి బ్రదర్స్‌' మాత్రం వెలగీసి ప్రత్యర్థులతో తలపడి హీరోలమనిపించుకున్నారు. 
 
అధికారంలో ఉండి వందలకోట్లు సంపాదించుకుని, అధికారం పోయిన తరువాత తమను వేధిస్తున్నారని చెప్పుకుంటూ హైదరాబాద్‌, బెంగుళూరుల్లో కాలక్షేపము చేస్తున్న నాయకులు...జెసి ప్రభాకర్‌రెడ్డిని చూసి బుద్ది తెచ్చుకోవాలి. తమ వ్యాపారాలపై దాడులు చేస్తున్నారని తాము రాజకీయంగా క్రియాశీలకంగా ఉండడం లేదని చెప్పే నాయకులు 'జెసి' కంటే ఎక్కువ వేధింపులు ఎదుర్కొన్నారా..?

'జెసి' ట్రావెల్స్‌పై పదే పదే దాడులు చేసినా..ఆయనను ఆయన కుమారుడిని జైలులో పెట్టినా 'జెసి ప్రభాకర్‌రెడ్డి' తలొగ్గలేదు. కార్యకర్తలను కాపాడుకుంటా తనను తాను కాపాడుకుంటూ ప్రత్యర్థులపైఎలా గెలవాలో చూపించారు. తాను లేని సమయంలో తన ఇంటిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి చొరబడి హంగామా సృష్టించినా, నామినేషన్లు వేసే సమయంలో ప్రత్యర్థులు చేసిన గొడవలను తట్టుకుంటూ, ప్రచారంలో ఆంక్షలను తట్టుకుంటూ 'జెసి' సోదరులు విజయఢంకా మోగించారు.

ఈ రకంగా మిగతా టిడిపి నాయకులు ఎందుకు చేయలేరు...?  ఎంతసేపూ వ్యాపారాలు, కుంటుంబాలు, సుఖాలు తప్ప..కార్యకర్తలను, పార్టీని కాపాడుకోవాలన్న ధ్యాసలేని నాయకులతో 'చంద్రబాబు' ఎలా గెలగవగలరు..? బలమైన కార్యకర్తలు, సానుభూతిపరులు ఉండి కూడా ఘోరమైన అపజయాలకు కారణం సత్తా లేని టిడిపి నాయకులేనన్న 'జెసి ప్రభాకర్‌రెడ్డి' వ్యాఖ్యలు అక్షర సత్యం. ఆయన బాటలో కొంత మందైనా పోరాడి ఉంటే ఈ రోజు ఇటువంటి ఘోరమైన అవమానం తప్పేది.