సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (09:50 IST)

పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 31,516 వార్డు మెంబర్‌ స్థానాల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయాన్నారు.

మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమని వెల్లడించారు. 26,851 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1,289 మంది స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,246 మంది స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,025 మంది మైక్రో అబ్వర్వర్స్ నియమించినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామన్నారు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.