శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (19:23 IST)

మోడీ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పు.. సిపిఐ

ప్రజలు మోడీ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పును గుర్తించి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 
 
"రాష్ట్ర పార్టీ కౌన్సిల్  సమావేశానికి హాజరయ్యను. ఎపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు మా పార్టీకి జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు ప్రయత్నిస్తాను. జమ్మూ కాశ్మీర్ విషయంలో పార్లమెంటు లో బిల్లు పాస్ చేయటం ఇప్పుడు రెండు యూనియన్ టెర్రిటరీస్ గా విడిపోయింది. 
 
జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం చేసిన పనికి కాశ్మీర్ లో పోరాడిన నాయకులు, కాశ్మీరీలు హౌస్ ఆరెస్టులకు గురయ్యారు. కాశ్మీర్ విషయంలో గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన మమ్మల్ని రాహుల్ గాంధీని ఒక గదిలో నిర్భధించారు.

జమ్మూకాశ్మీర్ విషయం లో కేంద్రం చేసింది న్యాయమైనదే అయితే ఎదుకు పార్టీల నాయకుల్ని అదుపులోకి తీసుకుని నిర్భధించారు? ఇంకెన్ని రోజులు జమ్మూకాశ్మీర్ ప్రజలను నిర్బంధించి ఉంచుతారు? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం మరోమారు తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలి. దేశంలో ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి.

బిజెపి, ఆరెస్సెస్ భావజాలాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దాలని చూడటం బాధాకరం . ఆర్టికల్ 360 రాజ్యాంగ బద్ధంగా చేసిందే అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు? భారత ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థలో ప్రాధమిక విభాగలైన పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ లను మరచిపోరాదు.

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగత్ రిజర్వేషన్ లను రద్దు చేయాలని ఒక డిబేట్ పెట్టాలని అన్నారు. దానిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు మోడీ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పును గుర్తించి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది" అని హెచ్చరించారు.