రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదు : బీజేపీ

ఎం| Last Updated: సోమవారం, 28 అక్టోబరు 2019 (16:15 IST)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.

రంగులేసుకుని, ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని విమర్శించారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇసుక కొరత సృష్టించారని కన్నా ఎద్దేవా చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు 150 రూపాయల కూలి కూడా రాని పరిస్థితికి తీసుకొచ్చారని… కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఇంతటి అసమర్ధ ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ.దీనిపై మరింత చదవండి :