మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (16:51 IST)

నీక్కావలసినవన్నీ నా దగ్గరున్నాయని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం

విజయవాడలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు చిరంజీవి అనే కామాంధుడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తరువాత జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
విజయవాడ పున్నమ్మతోట ప్రాంతానికి చెందిన చిరంజీవి అనే యువకుడు కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తను ఉంటున్న గదికి పక్కనే మైనర్ బాలిక మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇదే అదునుగా భావించి చిరంజీవి ఆమెకు మాయమాటలు చెప్పాడు.
 
నేను కొరియర్ చేస్తుంటాను కనకు నా దగ్గర బోల్డన్ని వస్తువులున్నాయనీ, అవన్నీ నీకు ఇస్తాను అని చెప్పి నాతో రా అంటూ తన గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియని వయస్సులో ఉన్న ఆ చిన్నారి  కాసేపటికి తేరుకుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు.
 
అయితే ఆ మైనర్ బాలిక నేరుగా విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. అంతకుముందే అతనికి దేహశుద్ధి చేశారు.