శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (11:19 IST)

స్మార్ట్ సిటీలుగా విశాఖ, కాకినాడ, తిరుపతి.. ఏపీ సర్కార్ ప్రతిపాదన..

దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా రూపుదిద్దాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని ఆ ప్రతిపాదనల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను కోరింది. 
 
స్మార్ట్ సిటీలను మూడు అంచెలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తొలుత 20 సిటీలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలనుకుని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపించాలని తెలిపింది. అది కూడా జూలై 31వ తేది లోగానే పంపించాలని సూచించింది. రెండో అంచెలో రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించి మిగిలిన నగరాలతో పోల్చి చూస్తుంది. 
 
మూడవ అంచెలో తుది జాబితాను ప్రకటించి, అందుకు తగిన విధంగా నిధులను సమకూరుస్తుంది. మరి ఈ స్థితిలో ఏపీ సర్కార్ ప్రతిపాదించిన విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలలో వేటికి స్మార్ట్ సిటీ అయ్యే యోగం తగులుతుందో చూడాలి.