మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 22 జులై 2021 (22:28 IST)

కరోనా భయంతో యేడాదిన్నరగా ఇంటిలోనే బక్కచిక్కి...

స్టే హోం.. స్టే సేఫ్ అనే నినాదాన్ని బాగా పాటించినట్లుంది ఆ కుటుంబం. అందుకేనేమో యేడాదిన్నర నుంచి కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వస్తుందన్న భయంతో వారు ఇంటిలోనే ఉండిపోయారట. ఈ విషయాన్ని వైద్యులకు స్వయంగా వారే చెప్పారు. 
 
తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం కడలి ప్రాంతానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటిలో ఉన్న తండ్రీకొడుకు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి కావాల్సిన సామగ్రి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు.
 
ఎంతో జాగ్రత్తగా వీరిద్దరు కూడా బయటకు వచ్చేవారు. అయితే వీరికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు మంజూరైంది. వేలిముద్ర వేయాలని వాలంటీర్ వీరు నివాసమున్న ఇంటి దగ్గరకు వచ్చింది. 
 
వారిని చూసి వాలంటీర్ ఆశ్చర్యపోయింది. మహిళలు బక్కచిక్కి కనిపించడంతో ఆ వాలంటీర్ ప్రశ్నించింది. అసలు విషయాన్ని వారు చెప్పడంతో స్థానిక నాయకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. దీంతో వారు ఆ ఐదుమందిని ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా బక్కచిక్కిపోవడంతో వారికి చికిత్స చేస్తున్నారు.