ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:49 IST)

అమ్మవారి నగలు దొంగలించి.. అలా ఇరుక్కుపోయాడు..

Thief
Thief
అమ్మవారి నగలు దొంగలించుకుని గుడిలో నుంచి బయటి వస్తామనుకున్న దొంగకు చుక్కలు కనిపించాయి. అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు  దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో ఊరికి చివరిగా జామి ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దొంగతనం చేసేందుకు కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి మంగళవారం ప్రయత్నించాడు. 
 
గుడి కిటికీ పగల గొట్టి  గుడిలోకి ప్రవేశించాడు.  అమ్మవారి విగ్రహానికి ఉన్న ఆభరణాలు ఇతర విలువైన  వస్తువులు దొంగిలించి తిరిగి అదే కిటికీ నుంచి బయటకు  వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ లోపలకు వెళ్లిన పాపారావు బయటకు రాలేకపోయాడు. తిరిగి వెనక్కిదిగలేక కిటికీలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.
 
ఇంతలో గ్రానస్థులు పాపారావు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోగా పాపారావు పరిస్ధితిని వీడియో తీసి తర్వాత బయటకు తీసి దేహశుధ్ది చేశారు. అనంతరం కంచిలి పోలీసులకు అప్పగించారు. పాపారావు మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.