1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (17:42 IST)

అన్నా... వైఎస్ఆర్‌సిపి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి జీతాలు రావడంలేదు: శ్రీరెడ్డి - video

Srireddy
ఆమధ్య ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలను చెప్పలేని భాషలో తిట్టిపోసిన నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఐతే ఈసారి తిట్టడం కాదు కానీ వైసిపి తరపున కష్టపడినవారి కోసం అభ్యర్థనలు చేస్తూ కనబడింది.
 
శ్రీరెడ్డి రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ... వైసిపి సోషల్ మీడియాలో పనేచేస్తున్నవారికి జీతాలు రావడంలేదన్నా. అందరూ తమకు జీతాలు రావడం లేదక్కా అంటూ చెప్పారు. యూ ట్యూబులో పార్టీ కోసం కష్టపడుతున్న ఇన్ఫ్లుయెర్స్ వారికి కూడా జీతాలు రావడంలేదు. ఆడపిల్లల బ్రతుకులు రోడ్లపైకి వచ్చాయన్న. ఇలా వారి జీవితాలు రోడ్లపైకి వచ్చాక కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే మేం బ్రతికి కూడా వేస్ట్ అన్న. ప్లీజ్ రెస్పాండ్ అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది.