గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (15:04 IST)

స్వర్ణముఖి నదిలో ముగ్గురు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం 250 కాలనీ వద్ద స్వర్ణముఖి నదిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 
 
దీంతో వారి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటనపై రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టించుకోలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతారాహిత్యంగా నడుచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.