శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (11:16 IST)

'టైగర్‌'తో కాకినాడ వాసుల టెర్రర్

Bengal Tiger
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓ టైగర్ స్థానికులన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పులిని వేటాడేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నెల రోజులు ఈ పులి వేట కోసం గాలిస్తున్నారు. పైగా, ఇది అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది. అంటే ఆ టైగర్ కుయుక్తుల ముందు అటవీ అధికారుల ఆటలు సాగడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పులి దెబ్బకు స్థానికు హడలిపోతున్నారు. 
 
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాళెం పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎటువైపు నుంచి తన పంజా విసురుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. అయితే, ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పెద్దపెద్ద బోన్లు ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని ఎరగా పెట్టారు. అయితే, ఈ ప్రాంతంలోకి ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.