మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (12:30 IST)

రెండు టన్నుల ఊరగాయలు.. విలువ రూ.12.65 లక్షలు.. ఏడు రకాలు

విజయ ఫుడ్ ప్రాడెక్ట్ యజమాని, గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము టీటీడీకి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. 
 
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు శ్రీ పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు టన్నుల ఊరగాయల విలువ రూ.12.65 లక్షలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఊరగాయల్లో ఏడు రకాలున్నాయని.. 4500 కేజీల ఊరగాయలున్నాయని.. 300 కేజీల పసుపు పొడి, 200 కేజీల మిరపపొడి, 300 కేజీల పులిహోర పేస్టులు వున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.