శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (10:04 IST)

అలిపిరి భక్తులకు షాకింగ్ న్యూస్.. చిరుత, ఎలుగుబంటి సంచారం

leopard - bear
అలిపిరి భక్తులకు షాకింగ్ న్యూస్. తిరుమల అలిపిరి నడకదారి వద్ద చిరుతల సంచారం భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా, అలిపిరి నడకమార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి కమ్యూనికేషన్స్ రిపీటర్ స్టేషన్ మధ్య ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. ట్రాప్ కెమెరాలో ఈ మేరకు రికార్డయింది.

ఈ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి కూడా తిరుగుతున్నట్టు కెమెరా ఫుటేజిల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేసింది.