తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం

boondi potu
ఠాగూర్| Last Updated: ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:52 IST)
బూందీ తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ తయారీ కోసం తయారు చేసే 19వ బూందీ పోటులో అ ప్రమాదం జరిగింది. ఇందులో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బూందీ పోటులో గోడలకు నెయ్యి అంటుకుని ఉండడంతో మంటలు మరింత పెరిగాయి.

కొద్దిసమయంలోనే మంటలు వ్యాపించడంతో బూందీ పోటులో ఉన్న కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు కూడా పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :