శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (19:46 IST)

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీని ఎంపిక చేసినట్లు పార్టీ నేతలకు ఆయన తెలిపారు. తిరుపతి లోక్‌సభ నియోజక వర్గంలో పార్టీ నేతలతో ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మీ మళ్లీ బరిలోకి దిగుతున్నట్లు నేతలతో చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మీ గెలుపుకోసం అందరూ అహర్నిశలు పాటుపడాలని పార్టీ నేతలకు తెలిపారు.
 
వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగబోతుంది. ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ ప్రటించబడ్డారు.