"వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్"గా తిరుపతి రైల్వే స్టేషన్
కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ రైల్వే స్టేషన్ నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంది.
అయితే, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రద్దీకి తగినట్టుగా రైల్వే స్టేషనులో ఇప్పటిదాకా పెద్ద అభివృద్ధి పనులు నోచుకోలేదు. గత రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉందో ఇపుడూ అలానేవుంది. అయితే, ఇపుడు రైల్వే మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్ శుభవార్త చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను తిరుపతి రైల్వే స్టేషన్‌గా మారబోతుంది.
ఈ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లను ఇప్పటికే పూర్తికాగా, ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.