బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (13:25 IST)

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

suicide
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనిత తన రూమ్‌మేట్స్ బయటకు వెళ్లిన సమయంలో కాలేజీ హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆమె రూమ్‌మేట్స్, ఆమె ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యారు. దీంతో వారు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
అనితది అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని గుర్రంకొండ గ్రామానికి చెందినదని పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.